VARANASI, మే 14 -- ఉత్తర్​ ప్రదేశ్​లో కొన్ని నెలల క్రితం కలకలం రేపిన సౌరభ్​ రాజ్​పుట్​ మర్డర్​ కేసు తరహాలో, అదే రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బల్లియాలో ఓ వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రియుడు చంపేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికారు.

ఉత్తర్​ప్రదేశ్​ హరిపూర్​లో జీవించే 62ఏళ్ల దేవేంద్ర రామ్​ ఒక మాజీ సైనికుడు. అతని భార్య పేరు మాయ. కాగా, మాయకు వివాహేతర బంధం ఉంది. ఆమె లవర్​ పేరు అనిల్​ యాదవ్​. తమ ప్రేమకు దేవేంద్ర అడ్డుగా ఉన్నాడని, ఆ అడ్డును తొలగించుకోవాలని మాయ- అనిల్​లు భావించారు. దేవేంద్రను చంపడానికి ప్లాన్​ చేశారు.

గత శుక్రవారం రాత్రి మాయ, దేవేంద్ర తినే ఆహారంలో మత్తుమందు కలిపింది. ఆయన అపస్మారక స్థితిలోకి జారుకున్న తర్వాత, మాయ తన భర్తను చంపేసింది. అనంతరం మాయ, అనిల్​లు మృతదేహాన్ని ఆరు భాగాలుగా ముక్కలు ముక్కలు చ...