భారతదేశం, మే 2 -- భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి బయోపిక్ రాబోతుందా? ఈ మూవీలో తమిళ స్టార్ హీరో లీడ్ రోల్ ప్లే చేయబోతున్నారా? అంటే సినీ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయి. సడన్ గా కోహ్లి బయోపిక్ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై క్రేజీ బజ్ వినిపిస్తోంది.కోహ్లి బయోపిక్ చర్చలు వైరల్ గా మారాయి. తాజాగా ఓ చాట్ షోలో కోహ్లి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలే ఇందుకు కారణం.

ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల ఓ చాట్ షోలో మాట్లాడుతూ.. 'నీ సింగం దాన్' సాంగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. ఈ పాటను సోషల్ మీడియా రీల్స్‌లో, క్రికెట్ వీడియోల్లో చాలా సార్లు వాడుతున్నారు కూడా. 'పత్తు తల' మూవీలోనిది ఈ సాంగ్. ఈ ఫిల్మ్ లో సిలంబరసన్ టీఆర్ (శింబు) హీరో. కోహ్లి కామెంట్ల తర్వాత ఈ సాంగ్ మరోసారి వైరలైంది. అంతే కాకుండా కోహ్లి బయోపిక్ లో శిం...