భారతదేశం, జూన్ 13 -- అహ్మదాబాద్​లో గురువారం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్​ భారత దేశంతో పాటు ప్రపంచాన్ని షాక్​కు గురిచేసింది. ఈ ఘటనలో విమానం లోపల ఉన్న 242 మంది ప్రాణాలు కోల్పోయరు. మృతుల్లో గుజరాత్​ మాజీ సీఎం, బీజేపీ పంజాబ్​ ఇంచార్జ్​ విజయ్​ రూపానీ కూడా ఉన్నారు. కూతురును కలిసేందుకు ఆయన లండన్​ బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, రూపానీ.. ఈ నెలలో రెండుసార్లు లండన్​ ట్రిప్​ని రద్దు చేసుకుని, చివరికి జూన్​ 12న విమానం ఎక్కినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి!

ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన విజయ్ రూపానీ త్వరలో జరగనున్న లుధియానా వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికల కారణంగా తన లండన్ పర్యటనను రెండుసార్లు వాయిదా వేసుకున్నారు! రూపానీ తొలుత జూన్ 1న భార్యతో కలిసి లండన్ వెళ్లాల్సి ఉండగా, ఆ తర్వాత తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. కానీ తన భార్యన...