భారతదేశం, సెప్టెంబర్ 21 -- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విద్యార్థుల కోసం రూ. 20 లక్షల వరకు స్కాలర్‌షిప్ ఇచ్చే సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మెరిట్ ఉన్న విద్యార్థులు తమ చదువులకు ఆర్థిక భరోసా పొందవచ్చు. ఈ స్కాలర్‌షిప్ కింద ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు మార్కుల్లో 10 శాతం సడలింపు ఉంటుంది. అంతేకాకుండా, మహిళలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు చెరో 50% సీట్లు కేటాయించడం విశేషం. ఈ నేపథ్యంలో ఎస్బీఐ స్కాలర్​షిప్​ 2025కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ పథకాన్ని 'ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్‌షిప్ 2025-26' పేరుతో ఎస్బీఐ ప్రారంభించింది. స్కూల్ విద్యార్థులు, అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, మెడికల్, ఐఐటీ, ఐఐఎం, విదేశాల్లో చదివే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. విద్యార్థులు ఎంచుకున్న కోర్సు, వారి చదువు స్థాయిని బట్టి ...