భారతదేశం, ఏప్రిల్ 25 -- ఏపీలో కొత్తగా 90వేల వితంతు పెన్షన్లను మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల తనిఖీ చేపట్టిన ప్రభుత్వం అర్హులైన వారికి పెన్షన్లను మంజూరు చేయడానికి అమోదం తెలిపింది. మరణించిన వారి స్థానంలో వారిపై ఆధారపడిన భార్య లేదా భర్తకు పెన్షన్లు మంజూరు చేస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్పౌజ్ కేటగిరీలో కొత్తగా 89,788 మందికి పింఛన్లు అందించ నున్నారు. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న లబ్దిదారులు ఎవరైనా మరణిస్తే అదే కుటుంబంలో పెన్షన్‌పై ఆధారపడిన వారికి వాటిని బదిలీ చేయనున్నారు.

భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా ఈ కేటగిరీని ప్రవేశపెట్టి గతేడాది నవంబరు నుంచే అమలు చేస్తోంది. అర్హులైన వారిని గుర్తించిన ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రతి నెల రూ.4 వేల చొప్పున చెల్లిస్తోంది.

కూ...