Hyderabad, అక్టోబర్ 6 -- టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ప్రమాదానికి గురయ్యాడు. ఏపీలోని పుట్టపర్తి నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా.. అతడు ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి విజయ్ తృటిలో తప్పించుకున్నట్లు తెలిసింది. అతనికి ఎలాంటి గాయాలు కాలేదు.

విజయ్ దేవరకొండ పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో నేషనల్ హైవే 44పై తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో విజయ్ కారును పక్క నుంచి మరో వాహనం ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

విజయ్ కారును ఢీకొట్టిన తర్వాత కూడా అవతలి వెహికిల్ ఆపకుండా అలాగే హైదరాబాద్ వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విజయ్ కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద సమయంలో అతడు ఖరీదైన లెక్సస్ కారులో...