భారతదేశం, జూలై 10 -- స్వప్రయోజనాల ముందు ప్రజల సమస్యలు, అవసరాలు పట్టవని విజయవాడ రాజకీయం రుజువు చేసింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు తమకు వందే భారత్‌ రైళ్లను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుంటే విజయవాడ కేంద్రంగా నడిచే రాజకీయం మాత్రం రైళ్లు రాకుండా అడ్డు పడుతున్నాయి. ఎప్పుడో రావాల్సిన వందే భారత్‌కు ఆటంకాలు సృష్టిస్తున్నాయి.

విజయవాడ నుంచి బెంగుళూరుకు డైరెక్ట్‌ ట్రైన్స్‌ లేవు. పైనుంచి వచ్చే రైళ్లలో విజయవాడ కోటా పెద్దగా ఉండదు. దీంతో టిక్కెట్లు దక్కడం దాదాపు అసాధ్యం. దీంతో విజయవాడ బెంగుళూరు మధ్య ట్రావెల్స్‌ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. నిత్యం పెద్ద సంఖ్యలో ట్రావెల్స్‌ బస్సులు బెంగుళూరుకు నడుస్తుంటాయి. సాయంత్రం ఆరు నుంచి రాత్రి 9 గంటల మధ్యలో విజయవాడ వారధి నుంచి పెద్ద సంఖ్యలో బెంగుళూరుకు ట్రావెల్స్‌ బస్సులు నడుస్తుం...