భారతదేశం, మే 21 -- ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై, బాంబు పేలుళ్లకు ప్రయత్నించిన విజయనగరం జిల్లాకు చెందిన యువకుడి బ్యాంకు ఖాతాలో లక్షల రుపాయల నగదును పోలీసులు గుర్తించారు. ఏ ఉద్యోగం చేయని సిరాజ్ ఖాతాలో ఏకంగా రూ.42లక్షల నగదు నిల్వలు ఉండటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

విజయనగరంలో అరెస్టైన ఐసిస్ సానుభూతిపరుడు సిరాజ్ ఉర్‌ రెహ్మాన్‌ వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. నిఘా వర్గాల సమాచారంతో గత శనివారం హైదరాబాద్‌, విజయనగరంలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతకు ముందే వీరి కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు.

శనివారం నిందితుల్ని అదుపులోకి తీసుకున్న వెంటనే వారి బ్యాంకు ఖాతాలను స్తంభింప చేశారు. సిరాజ్‌ తండ్రి, సోదరుడు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. విజయనగరం జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులో సిరాజ్‌కు ఉన్న ...