భారతదేశం, జూలై 6 -- టోల్​ ఛార్జీల విషయంలో వాహనదారులకు బిగ్​ రిలీఫ్​! సొరంగ మార్గాలు, వంతెనలు, ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ స్ట్రెచ్‌లు వంటి నిర్మాణాలను కలిగి ఉన్న జాతీయ రహదారుల్లో టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం మోటార్‌సైకిల్‌ ప్రయాణికుల ప్రయాణ ఖర్చులను తగ్గిస్తుంది. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజులను ఎన్​హెచ్​ ఫీజు రూల్స్ 2008 ప్రకారం వసూలు చేస్తారు. ఇక ఇప్పుడు రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2008 నిబంధనలకు సవరణలు చేసింది. భారతదేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను లెక్కించడానికి ఒక కొత్త పద్ధతి లేదా ఫార్ములాను నోటిఫై చేసింది.

ఇటీవలే విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం.. "ఒక నిర్మాణం లేదా నిర్మాణాలను కలిగి ఉన్న జాతీయ రహదారి విభాగం వినియోగానికి సంబంధించిన రుసుము రేటును లెక్కించ...