Hyderabad, సెప్టెంబర్ 19 -- పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మరో పండగలాంటి సాంగ్ వచ్చేసింది. వచ్చే వారం రిలీజ్ కాబోతున్న ఓజీ మూవీలో పవన్ స్వయంగా పాడిన వాషి యో వాషి అనే జపనీస్ హైకూ రావడం విశేషం. తమన్ డిఫరెంట్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

తన సినిమాల్లో పాటలు పాడే అలవాటు ఉన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు రాబోతున్న ఓజీ మూవీలోనూ ఓ పాట పాడాడు. అయితే అది జపనీస్ హైకూ (చిన్న కవిత) కావడం విశేషం. ఈ సాంగ్ ను శుక్రవారం (సెప్టెంబర్ 19) మేకర్స్ రిలీజ్ చేశారు. మూవీలో విలన్ అయిన ఓమి (ఇమ్రాన్ హష్మి)ని ఉద్దేశించి ఓజీ ఓ వార్నింగ్ ఇస్తూ పాడే పాట ఇది.

"ఓమి మై డియర్ ఓమి.. ఎగరెగిరి పడుతున్నావ్.. నీలాంటి వాళ్లను నేలకు ఎలా దించాలో నాకు బాగా తెలుసు.. చిన్నప్పుడు నా గురువు చెప్పిన హైకూ చెబుతాను విను.. వాషి యో వాషి" అంటూ ఇది సాగిపోయింది. పవన్ తనదైన స్టైల్...