భారతదేశం, మే 20 -- టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన వార్ 2 సినిమా టీజర్ నేడు (మే 20) వచ్చేసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీమ్ ఈ టీజర్ తీసుకొచ్చింది. ఈ చిత్రంతోనే బాలీవుడ్‍లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. హృతిక్ రోషన్‍తో కలిసి ప్రధాన పాత్ర పోషించారు. వార్ 2 టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ లుక్స్, యాక్షన్‍ అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. ఈ టీజర్లో హీరోయిన్ కియారా అడ్వానీ ఇచ్చిన సడెన్ సర్‌ప్రైజ్ ఆశ్చర్యపరిచారు.

వార్ 2 టీజర్లో ఎక్కువగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కనిపించారు. హీరోయిన్ కియారా అడ్వానీ కొన్ని సెకెన్లే అలా తళుక్కుమన్నారు. అయితే, ఎల్లో బికినీలో హాట్ లుక్‍తో కియారా కనిపించారు. ప్రేక్షకులను ఇది సర్‌ప్రైజ్ చేసింది. కియారా ఫస్ట్ టైమ్ సినిమాల్లో బికినీలో కనిప...