భారతదేశం, ఫిబ్రవరి 4 -- ఎస్ఎస్ రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి. ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఫస్ట్ సినిమా ఇదే. ఈ చిత్రం గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్ గా తెరకెక్కుతోంది. ఈ వారణాసి సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా హాలీవుడ్ మీడియాతో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా వారణాసి టీజర్ పై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ''సాధారణంగా తన సినిమా కథలను ముందే మీడియాకు చెప్తాడు రాజమౌళి. కానీ వారణాసి విషయంలో మాత్రం అలా చేయలేదు. టీజర్ తోనే కథ చెప్పాలనుకున్నాడు. ఆ ఆలోచన, ఆయన అనుకున్న విజువల్స్ విని నా మైండ్ పోయింది'' అని మహేష్ బాబు తెలిపాడు.

వారణాసి టీజర్ కోసం టీమ్ ఒక ఏడాది పాటు కష్టపడిందన...