భారతదేశం, ఫిబ్రవరి 4 -- ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ 'వారణాసి'. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ గతేడాది విడుదలై సంచలనం సృష్టించింది. అయితే ఆ వీడియోలోని అద్భుతమైన విజువల్స్ చూసి కొందరు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రూపొందించారని అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించాడు.

రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ 3 నిమిషాల గ్లింప్స్ వీడియోను రూపొందించడానికి తమ ఆర్టిస్టులు వారాల తరబడి కష్టపడ్డారని వివరించాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "భవిష్యత్తులో చూస్తే AI జనరేటెడ్ అని అనడాన్ని అవమానంగా భావించడం ఫన్నీగా అనిపిస్తుంది. 'వారణాసి' సినిమా విడుదలయ్యే సమయానికి AI ఎంతలా అభివృద్ధి...