భారతదేశం, ఫిబ్రవరి 6 -- మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక సినిమా 'వారణాసి'. ఇది టైమ్ ట్రాటర్, గ్లోబ్ ట్రాటర్ గా రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7, 2027న రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ రీసెంట్ గా అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో వారణాసి ఓటీటీ, ఓవర్సీస్ రైట్స్ డీల్స్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది.

వారణాసి మూవీని రికార్డు ఓటీటీ రేటుకు అమ్మేందుకు రాజమౌళి అండ్ ప్రొడ్యూసర్ టీమ్ ప్లాన్ చేస్తోందని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఓటీటీ హక్కుల నుంచే రూ.600 కోట్లు రాబట్టాలని చూస్తున్నారని టాక్. ఇండియన్ మూవీకి ఇది రికార్డు రేట్ అని చెప్పొచ్చు. రీసెంట్ గా అల్లు అర్జున్- అట్లీ మూవీ ఓటీటీకి రూ.600 కోట్ల ధర పలికిందనే వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

వారణాసిని వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ కు దగ్గర చేసేందుకు రాజమౌళి పెద్ద ప్ల...