భారతదేశం, ఫిబ్రవరి 4 -- భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా 'వారణాసి'. ఇదో టైమ్ ట్రావెల్, గ్లోబ్ ట్రాటర్ మూవీగా రెడీ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్. ఇందులో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏడేళ్ల తర్వాత ప్రియాంక చేస్తున్న ఇండియన్ మూవీ ఇది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వారణాసి మూవీకి ఓకే చెప్పేముందు రాజమౌళిని ఓ రిక్వెస్ట్ చేసినట్లు ప్రియాంక చోప్రా వెల్లడించింది.

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిన హీరోయిన్ ప్రియాంక చోప్రా ఏడేళ్ల తర్వాత వారణాసితో తిరిగి ఇండియన్ సినిమాల్లోకి రాబోతుంది. ఓ ఇంటర్వ్యూలో వారణాసి మూవీకి ఓకే చెప్పేందుకు డైరెక్టర్ రాజమౌళిని ఓ రిక్వెస్ట్ చేశానని వెల్లడించింది. ఈ సినిమాలో తనతో డ్యాన్స్ చేయించాలని కోరినట్లు ప్రియాంక చోప్రా చెప్పింది. దీంతో మహేశ్ బాబు బల...