భారతదేశం, మే 18 -- పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ-సీ61) ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదివారం ఈఓఎస్-09ను విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రోకు ఇది 101వ ఉపగ్రహ ప్రయోగం.

ఆంధ్రప్రదేశ్​ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ వాహకనౌకను ఇస్రో ప్రయోగించింది. పీఎస్ఎల్వీకి ఇది 63వ ప్రయోగం కాగా, పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ కాన్ఫిగరేషన్​తో ఇది 27వ ప్రయోగం.

పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) తన 63వ మిషన్​లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్-09)ను మోసుకెళుతోంది. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లో భూమి ఉపరితలానికి సంబంధించిన హై-రిజల్యూషన్ చిత్రాలను తీయగలదు.

వ్యవసాయం, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక, జాతీయ భద్రతకు ఈ ఉపగ్రహం కీలకంగా మారనుంది.

ఈ ప్రయోగం విజయవంతం కావాలని కోరు...