భారతదేశం, జూలై 20 -- మెసేజింగ్​ దిగ్గజం వాట్సాప్​ యూజర్స్​ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్​ని తీసుకొస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు వాట్సాప్​ నుంచి కొత్త ఏఐ ఫీచర్​ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ ఏఐ ఫీచర్​.. మీరు చదవని (అన్​రెడ్​) మెసేజ్​ల సమ్మరీని చూపిస్తుందని తెలుస్తోంది. తద్వారా మీరు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు!

ఈ వ్యక్తిగత మెసేజింగ్ యాప్ మెటా ఏఐ సామర్థ్యాలను ఉపయోగించుకొని, వినియోగదారులు తమ అన్​రెడ్​ మెసేజ్‌ల సారాంశాన్ని తెలుసుకోవడానికి అనుమతిస్తుంది. అదే సమయంలో యూజర్స్​ సంభాషణల గోప్యతకు ఎటువంటి ఆటంకం ఉండదు.

వాబీటాఇన్​ఫో ప్రకారం.. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను అమలు చేయడానికి చూస్తోంది. ఇది వినియోగదారులు నిర్దిష్ట సంభాషణల సారాంశాన్ని రూపొందించడానికి అనుమతిస్తుంది. ఇప్పటికే ఉన్న మెసేజ్ సమ్మరీస్ ఫీచర్‌కు భిన్నంగా.. కొత్త "క్విక్ రీక్యాప...