భారతదేశం, జూన్ 1 -- నైరుతి రుతుపవనాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మరీ ముఖ్యంగా అతి భారీ వర్షాలకు ఈశాన్య భారతం అల్లకల్లోలంగా మారింది. అసోం నుంచి అరుణాచల్​ ప్రదేశ్​ వరకు పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్నాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో శనివారం ఉత్తర సిక్కిం అంతటా సుమారు 1,500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. అనేక మంది గల్లంతయ్యారు.

గల్లంతైన ఎనిమిది మంది పర్యాటకుల కోసం గాలింపు చర్యలకు శనివారం భారీ వర్షం అంతరాయం కలిగించింది. తీస్తా నది నీటిమట్టం పెరగడంతో సహాయక చర్యలను నిలిపివేశారు. మాంగన్ జిల్లాలోని లాచెన్-లాచుంగ్ హైవేపై మున్సితాంగ్ సమీపంలో గురువారం రాత్రి వారి వాహనం నదిలో పడిపోవడంతో పర్యాటకులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

ఉత్తర సిక్కింలోని ...