భారతదేశం, ఏప్రిల్ 25 -- పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ వరుసగా రెండో సెషన్ లో కూడా నష్టపోయింది. మదుపర్లు ముందు జాగ్రత్తగా ప్రాఫిట్ బుకింగ్ కు వెళ్లడంతో, మార్కెట్ నష్టాల్లో ముగిసింది. శుక్రవారం సెన్సెక్స్ 589 పాయింట్లు లేదా 0.74 శాతం క్షీణించి 79,212.53 వద్ద ముగియగా, నిఫ్టీ 207 పాయింట్లు లేదా 0.86 శాతం క్షీణించి 24,039.35 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.44 శాతం, 2.56 శాతం నష్టాల్లో ముగిశాయి. అస్థిరత సూచీ ఇండియా విక్స్ దాదాపు 6 శాతం పెరిగి 17.16కు చేరుకుంది. ఇది మార్కెట్ భాగస్వాములలో పెరిగిన భయాందోళనలను సూచిస్తుంది.

బిఎస్ఇ లిస్టెడ్ కంపెనీల సంచిత మార్కెట్ క్యాపిటలైజేషన్ గత సెషన్లో దాదాపు 430 లక్షల కోట్ల రూపాయల నుండి దాదాపు 421 లక్షల కోట్ల రూ...