Hyderabad, సెప్టెంబర్ 10 -- మెగా ఫ్యామిలీలోకి మరో వారుసుడు వచ్చాడు. నాగబాబు తనయుడు, నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠీ దంపతులకు బుధవారం (సెప్టెంబర్ 10) మగబిడ్డ జన్మించాడు. ఈ విషయాన్ని అటు వరుణ్ తోపాటు ఇటు చిరంజీవి కూడా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

లావణ్య త్రిపాఠీ బాబును ఎత్తుకొని మురిసిపోతుండగా.. వరుణ్ తేజ్ ఆమె నుదుటిపై ముద్దు పెడుతున్న ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫొటోను వరుణ్ ఇన్‌స్టాలో షేర్ చేశాడు. మా లిటిల్ మ్యాన్ అనే క్యాప్షన్ తో అతడు తమకు బాబు పుట్టిన విషయాన్ని చెప్పాడు. ఈ పోస్టుకు శ్రియ శరణ్, రకుల్ ప్రీత్ లాంటి హీరోయిన్లు కూడా కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేశారు. నిమిషాల్లోనే ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఎంతో మంది అభిమానులు కూడా కొత్తగా పేరెంట్స్ గా ప్రమోషన్ పొందిన వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు చెప్పారు.

అటు వరుణ్ పెదనాన్న, మె...