భారతదేశం, జూలై 8 -- స్టాక్​ మార్కెట్​ ట్రేడింగ్​ అంటేనే రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. అలాంటిది ఫ్యూచర్​ అండ్​ ఆప్షన్స్​లో ట్రేడింగ్​ ఇంకా పెద్ద రిస్క్​! క్షణాల్లో లక్షలు సంపాదించవచ్చు, కోల్పోవచ్చు కూడా. వీటిల్లో ఒడుదొడుకులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఇప్పుడు ఫ్యూచర్​ అండ్​ ఆప్షన్స్​లో ట్రేడింగ్​ ఎంత ప్రమాదకరమో చెబుతూ సెబీ నివేదిక ఒకటి బయటకు వచ్చింది. ఈ నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక ఏడాదిలో ఈ తరహా ట్రేడింగ్​ వల్ల 91శాతం మంది నష్టపోయారు! ఇది ఒక్క ఏడాదే కాదు, గత కొన్నేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉంది.

వ్యక్తిగత ట్రేడర్ల నికర నష్టం రూ.74,812 కోట్ల నుంచి 41 శాతం పెరిగి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,05,603 కోట్లకు చేరింది. ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో వ్యక్తిగత ట్రేడర్ల లాభనష్టాలను విశ్లేషిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 91 శాతం...