భారతదేశం, ఆగస్టు 6 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విధిస్తున్న టారీఫ్​ల అనిశ్చితి నేపథ్యంలో దేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) నిర్ణయించింది. ఈ మేరకు మొనేటరీ పాలసీ సమావేశం ముగింపు అనంతరం ఆర్బీఐ గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా ప్రకటన చేశారు. ద్రవ్య విధానంలో 'న్యూట్రల్' వైఖరి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఫలితంగా రెపో రేటు 5.5శాతం వద్ద కొనసాగుతుంది.

సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 వరకు జరిగిన ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష సమావేశం.. ఈ ఆర్థిక సంవత్సరానికి మూడవ ద్వైమాసిక మాటింగ్​. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఒకసారి రేటు కోత, 100 బేసిస్ పాయింట్ల (బీపీఎస్​) సీఆర్ఆర్ తగ్గింపు ద్వారా సడలింపు చర్యలను ఆర్బీఐ ముందుగానే చేపట్టింది.

జూన్ నెల ఆర్బీఐ మొనేటరీ పాలసీ మీటింగ్​లో, ద్రవ్య వి...