Hyderabad, మే 19 -- ఓటీటీలోకి ప్రతి నెలలాగే వచ్చే జూన్ నెలలోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్నాయి. వీటిలో హిట్ 3, సింగిల్, శుభంలాంటి హిట్ సినిమాలు ఉండటం విశేషం. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఇవి రానున్నాయి. వీటితోపాటు మరో రెండు వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి.

నాని కెరీర్లో అతిపెద్ద హిట్ గా నిలిచిన మూవీ హిట్ 3. ఈ నెల 1న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూన్ 5 నుంచి ఆ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన హిట్ యూనివర్స్ నుంచి వచ్చిన మూడో సినిమా ఇది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కాస్త వయోలెన్స్ ఎక్కువన్న వ...