భారతదేశం, సెప్టెంబర్ 1 -- పర్సనల్ లోన్ తీసుకున్న వారికి అప్పు వసూలు చేసే ఏజెంట్లతో మాట్లాడటం ఒత్తిడితో కూడుకున్న పని! అయితే, మీకు ఉన్న హక్కులు, బాధ్యతలు తెలుసుకుంటే ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవచ్చు.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) జారీ చేసిన కఠినమైన నిబంధనల ప్రకారం.. రుణం తీసుకున్న వారిని ఏజెంట్లు వేధించడం, బెదిరించడం వంటి అనైతిక పద్ధతులను పాటించకూడదు. రుణ గ్రహీతలను రక్షించడానికి బ్యాంకులు, వాటి ఏజెంట్లు తప్పనిసరిగా ఈ నిబంధనలను పాటించాలి.

అయితే పరిస్థితి అక్కడి వరకు వెళ్లకుండా ఉండాలంటే, లోన్​ తీసుకునే ముందే సరైన ప్రణాళికతో ఉండటం చాలా ముఖ్యం.

స్విచ్‌మైలోన్ వ్యవస్థాపకుడు చింతన్ పంచ్‌మతియా మాట్లాడుతూ.. "రుణ వసూళ్ల ఒత్తిడిని నివారించడానికి సులభమైన మార్గం సమయానికి ఈఎంఐలు చెల్లించడం. రుణం గడువును పెంచడం లేదా తక్కువ వడ్డీకి మారడం వల్ల నెలవ...