భారతదేశం, జూలై 20 -- అమెరికాలో అట్లాంటాకు బయలుదేరిన డెల్టా ఎయిర్​లైన్స్ బోయింగ్​ 767 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, దాని ఎడమ ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం లాస్ ఏంజెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానం అత్యవసరంగా ల్యాండ్​ అయ్యింది. కాగా, విమాన ఇంజిన్​లో మంటలకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

బోయింగ్ 767-400 (టెయిల్ నంబర్ N836MH) ద్వారా నడుపబడుతున్న ఫ్లైట్ డీఎల్446కు సంబంధించిన ఫుటేజీలో, విమానం గాల్లో ఉన్నప్పుడు దాని ఎడమ ఇంజిన్ నుంచి మంటలు వస్తున్నట్లు కనిపించింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది త్వరగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.

"ఎల్.ఎ. ఫ్లైట్స్" అనే ఏవియేషన్ యూట్యూబ్ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారంలో విమానం అత్యవసర ల్యాండింగ్, ఎడమ ఇంజిన్ నుంచి మంటల...