భారతదేశం, సెప్టెంబర్ 24 -- కోటీశ్వరులు అవ్వాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. దానికి ఉత్తతమైన మార్గం ఇన్వెస్ట్​మెంట్స్​! అందుకే ఇప్పుడు చాలా మంది మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెడుతున్నారు. ఎంత చిన్న వయస్సులో లేదా ఎంత త్వరగా ఇన్వెస్ట్​మెంట్​ జర్నీని ప్రారంభిస్తే అంత మంచిది. ఎందుకంటే మార్కెట్​లో ఎక్కువ కాలం ఉండగలిగితే, పెట్టుబడులు మంచి రిటర్నులు ఇస్తాయి. కానీ డబ్బు సర్దుబాటు కాకకపోవడం వల్లో లేక తక్కువ వేతనం కారణంగానో చాలా మంది చిన్న వయస్సులో ఇన్వెస్ట్​మెంట్​ జర్నీని ప్రారంభించలేకపోతుంటారు. అలాంటి వారిలో మీరూ ఉన్నారా? వాస్తవానికి ఇన్వెస్ట్​మెంట్​ జర్నీ ఆలస్యమైంది. కానీ ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు! 40ఏళ్ల వయస్సులోనూ మీరు మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​మెంట్​ని ప్రారంభించి, కోటీశ్వరులు అవ్వొచ్చు. ఎంత పెట్టుబడి పెట్టాలి? వంటి వివరాలను ఇక్కడ ...