భారతదేశం, సెప్టెంబర్ 15 -- ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడిపోతుందో తెలియని గందరగోళ కాలంలో మనం జీవిస్తున్నాము! హెచ్​ఆర్​ నుంచి ఎప్పుడు ఏ మెయిల్​ వస్తుందో, లేఆఫ్​ లిస్ట్​లో మనం కూడా ఉంటే నెక్ట్స్​ ఏం చేయాలో అన్న భయాలు సర్వసాధారణంగా మారిపోయాయి. మీకు కూడా ఇలాంటి భయాలే ఉన్నాయా? మీ ఉద్యోగం ఉంటుందో లేదో ఆర్థం కావడం లేదా? అయితే.. లేఆఫ్​కి ముందే, మీ ఆర్థిక భద్రత కోసం వెంటనే ఈ టిప్స్​ ఫాలో అవ్వండి.

1. ఎమర్జెన్సీ ఫండ్​-

ఎమర్జెన్సీ ఫండ్​ అనేది చాలా కీలకం. ఉద్యోగం పోయిన సందర్భంలో.. మీ అవసరాలు, ఇతర ఖర్చులను భరించగలిగే విధంగా.. 6 నుంచి 12 నెలల వరకు సరిపడా నిధులు అందులో ఉండాలి. ఆ డబ్బు మీ వద్ద ఉంటే భయం కాస్త తగ్గుతుంది. ఒక్కోసారి ఈ ఎమర్జెన్సీ ఫండ్స్​ని ఈజీ యాక్సెసిబుల్​ లిక్విడ్​ ఇన్​స్ట్రుమెంట్స్​లో పార్క్​ చేయడం కూడా మంచిదే. కానీ వీటిని స్టాక్​ మ...