భారతదేశం, జూలై 1 -- మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఓ ప్రేమ జంటకు సంబంధించిన షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రితికా సేన్ (29) అనే యువతిని ఆమె ప్రియుడు గొంతు నులిమి హత్య చేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించే వరకు 32 ఏళ్ల నిందితుడు రెండు రోజుల పాటు ఆ శవంతో ఇంట్లోనే ఉన్నాడు. హత్య విషయాన్ని నిందితుడు తన స్నేహితుడికి తెలియజేయడంతో అతను మొదట ఇది జోక్ అని భావించాడు.

సచిన్ రాజ్ పుత్ అనే నిందితుడు జూన్ 27న తన భాగస్వామి రితికా సేన్ (29) ని హత్య చేసి రెండు రోజుల పాటు మృతదేహంతో పాటే ఉండి చివరకు మిస్రోడ్ లోని తన స్నేహితుడు అనూజ్ కు హత్య చేసిన విషయాన్ని వెల్లడించాడు. దాంతో, ఆ స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

నిందితుడు సచిన్ నిరుద్యోగి. రితిక జాబ్ చేస్తోంది. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న రితికా మూడున్నరేళ్లుగా సచ...