భారతదేశం, మే 11 -- ఈ మధ్యకాలంలో అవసరం ఉన్నా, లేకపోయినా.. నెలవారీ జీతం వస్తున్న దాదాపు ప్రతి వ్యక్తి దగ్గర క్రెడిట్​ కార్డు కనిపిస్తోంది. నిరంతరం అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థలో, క్రెడిట్ కార్డులు ఒక ముఖ్యమైన ఆర్థిక సాధనంగా ఆవిర్భవించాయి. రివార్డ్​ పాయింట్లు, డిస్కౌంట్స్​తో ఈ క్రెడిట్​ కార్డులు మరింత అట్రాక్టివ్​గా మారుతున్నాయి. దీంతో వినియోగదారుల్లో వీటికి ఆదరణ లభిస్తోంది. అయినప్పటికీ, క్రెడిట్ కార్డులను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా లిమిట్​కి మించి క్రెడిట్​ వార్డును వాడితే చాలా నష్టాలు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. 'ఓవర్ లిమిట్'కు వెళ్లడం వల్ల అదనపు ఛార్జీలు, వడ్డీతో పాటు మీ క్రెడిట్ స్కోర్​ దెబ్బతింటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో క్రెడిట్​ కార్డు 'ఓవర్​ లిమిట్​' ఫెసిలిట...