భారతదేశం, ఏప్రిల్ 21 -- ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​​లో విపరీతమైన పోటీ ఉంది. కస్టమర్స్​ని ఆకట్టుకునేందుకు ఆటోమొబైల్​ సంస్థలు కొత్త కొత్త మోడల్స్​ని లాంచ్​ చేస్తున్నాయి. కాగా ఈ సెగ్మెంట్​లో అత్యధిక వాటా కలిగిన సంస్థగా దేశీయ దిగ్గజం టాటా మోటార్స్​ కొనసాగుతోంది. ఈ కంపెనీకి చెందిన 5 మోడల్స్​ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. బడ్జెంట్​ రేంజ్​ నుంచి కాస్త ప్రీమియం రేంజ్​ వరకు అన్ని ప్రైజ్​ పాయింట్స్​లోనూ టాటా మోటార్స్​కి చెందిన ఎలక్ట్రిక్​ కార్లు ఉన్నాయి. వీటిల్లో సేఫ్టీ ఫీచర్స్​ చాలా ఉన్నాయి. ఫలితంగా, ఒక వేళ మీరు కొత్త ఈవీ కొనాలని అనుకుంటుంటే కింద ఇస్తున్న టాటా కార్ల రేంజ్​, సేఫ్టీ ఫీచర్స్​, ధరలు వంటి వివరాలను తెలుసుకుని ప్లాన్​ చేయడం ఉత్తమం. టాటా కార్ల వివరాలు..

టాటా టియాగో ఈవీ- ఇండియాలో తక్కువ ధరకు లభిస్తున్న ఎల...