భారతదేశం, జూలై 25 -- అంతర్జాతీయ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్.. ఈ ఆగస్టులో భారతదేశంలో రెండు ఈవీలను లాంచ్​ చేయనుంది.అవి వీఎఫ్​6, వీఎఫ్​7. వీటి బుకింగ్స్​ ఇప్పటికే అధికారిక వెబ్​సైట్​లో మొదయ్యాయి. రూ.21వేల టోకెన్​ అమౌంట్​తో ప్రీ బుకింగ్​ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు వీఎఫ్​7కి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించింది. వీఎఫ్​7 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ వేరియంట్లు, ఔటర్​ కలర్​ ఆపన్ష్​, కీలక ఫీచర్లను ఆవిష్కరించింది. ఇది ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నుంచి కొనుగోలుదారులు ఏమి ఆశించవచ్చో స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

విన్‌ఫాస్ట్ వీఎఫ్​7 మూడు విభిన్న వేరియంట్లలో లభ్యం కానుంది: ఎర్త్, విండ్, స్కై. ప్రతి వేరియంట్ విభిన్న కస్టమర్ అవసరాలకు తగిన ఫీచర్లు, పనితీరును అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి వేరియంట...