భారతదేశం, ఏప్రిల్ 16 -- హరియాణాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ మహిళ- లవర్​తో కలిసి తన భర్తను చంపేసింది. వారిద్దరిని అతను ఏకాంతంగా, అసభ్యకర స్థితితో చూసి, గొడవ పెట్టుకోవడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.

హరియాణా హిసార్​ జిల్లాలోని ప్రేమ్​నగర్​లో ఈ ఘటన జరిగింది. 32ఏళ్ల రవీనకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా ఆమెకు ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్​ చేయడం ఇష్టం. ఇతర క్రియేటర్లతో కలిసి ఆమె డ్యాన్స్​ వీడియోలను పోస్ట్​ చేస్తుంటుంది. ఆమెకు ఒక యూట్యూబ్​ ఛానెల్​ కూడా ఉంది.

కాగా 32ఏళ్ల రవీనకు సురేష్​ అనే వ్యక్తి ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం అయ్యాడు. ఏడాదిన్నర పాటు ఇద్దరు కలిసి ఇన్​స్టాగ్రామ్​లో కంటెంట్​ క్రియేట్​ చేశారు.

వాస్తవానికి రవీన భర్త ప్రవీణ్​, అతని కుటుంబసభ్యులకు సురేష్​ అంటే ఇష్టం లేదు. అతడికి దూరంగా ఉండాలని చెప్పేవారు. కానీ రవీన మాత్రం సురేష...