భారతదేశం, జూలై 16 -- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత కోసం కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీ జూలైలో 20వ విడతగా రూ.2,000 విడుదల చేయనున్నారు. పిఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి జమ అవుతాయి. మునుపటి 19 వ విడత ఫిబ్రవరి 2025 లో విడుదల అయ్యాయి. 2024 లో జూన్ నెలలో ఈ మొత్తాన్ని విడుదల చేయగా, ఈసారి నిధుల విడుదలలో కొంత జాప్యం జరిగింది.

పీఎం-కిసాన్ పథకం 20వ విడత జూలై 18న విడుదలయ్యే అవకాశం ఉందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించలేదు. మీడియా నివేదికల ప్రకారం, ప్రధాని నరేంద్ర మోడీ జూలై 18 న మోతీహరి (తూర్పు చంపారన్) లో జరిగే ఒక బహిరంగ సభలో దేశవ్యాప్తంగా 9.8 కోట్లకు పైగా రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 20 వ విడత డబ్బులను విడుదల చేయవచ్చు. అర్హులైన లక్షలా...