భారతదేశం, ఫిబ్రవరి 6 -- హామీల అమలును కప్పిపుచ్చుకోవడానికి కీలకమైన మున్సిపల్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్ల దండకం అందుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అయితే రేవంత్ రెడ్డి తిట్ల ట్రాప్ లో పడవద్దని పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డపై ప్రస్తుతం ఒక వికృతమైన రాజకీయ క్రీడ నడుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఎప్పుడూ బిరుదుల కోసం. సన్మానాల కోసం పాకులాడలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు మరియు సంక్షేమమే ఆయనకు నిజమైన సత్కారమని స్పష్టం చేశారు.

"నేడు అధికార గర్వంతో రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ వ్యక్తిత్వం మీద విషం చిమ్ముతున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి మీద జరుగుతున్న దాడి కాదు. తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద జరుగుతున్న దాడి" అని కేటీఆర్ ...