భారతదేశం, ఏప్రిల్ 16 -- Vijayasai Reddy: ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన మద్యం కొనుగోళ్లు, అమ్మకాలపై సిట్‌ విచారణలో వేగం పెరిగింది. గురువారం సిట్‌ విచారణకు రావాలని మాజీ ఎంపీ సాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ఓసారి సిట్ విచారణకు హాజరైన సాయిరెడ్డి. మద్యం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన రాజ్‌ కసిరెడ్డి పేరును ప్రస్తావించారు. సాయిరెడ్డి ప్రకటన తర్వాత వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ చేయకుండా రక్షణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఉపశమనం దక్కకపోవడంతో సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పొందారు.

సాయిరెడ్డిని సాక్షిగా పరిగణిస్తూ సిట్‌ విచారణకు పిలిచిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది.వైసీపీ ప్రభుత్వ హయంలో సాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఓ దశలో వైసీపీ...