Hyderabad, జూలై 29 -- గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి లీడ్ రోల్లో నటించిన మూవీ జూనియర్. ఈ సినిమా జులై 18న థియేటర్లలో రిలీజైంది. ఓ మోస్తరు రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ దగ్గర్ ఫర్వాలేదనిపించింది. శ్రీలీలతోపాటు జెనీలియా రీఎంట్రీ మూవీకి కలిసొచ్చింది. అయితే ఇప్పుడీ మూవీ రెండు వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జూనియర్ మూవీ జులై 18న థియేటర్లలో రిలీజ్ కాగా.. రెండో వారమే బాక్సాఫీస్ రన్ పూర్తవడానికి వస్తోంది. జులై 31తో ఈ సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుతోపాటు కన్నడలోనూ ఒకేసారి రూపొందించిన ఈ సినిమాను శనివారం (ఆగస్ట్ 2) నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే మూవీకి వచ్చిన పాజిటివ్ రివ్యూలను క్యాష్ చేసుక...