భారతదేశం, జూన్ 1 -- కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన పెళ్లి కాని ప్రసాద్ చిత్రం థియేటర్లలో ఈ ఏడాది మార్చి 21వ తేదీన విడుదలైంది. ప్రమోషన్లను మూవీ టీమ్ బాగానే చేసింది. అయితే, మిక్స్డ్ టాక్ రావటంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు దక్కలేదు. ఈ కామెడీ డ్రామా సినిమాకు అభిలాశ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ పెళ్లి కాని ప్రసాద్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.

పెళ్లి కాని ప్రసాద్ సినిమా జూన్ 5న ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (జూన్ 1) అధికారికంగా వెల్లడించింది. దీంతో మరో నాలుగు రోజుల్లో ఈటీవీ విన్‍లో ఈ మూవీని చూడొచ్చు.

పెళ్లి కాని ప్రసాద్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు ఆలస్యమైంది. ముందుగా ఓటీటీ కాకపోవడం వల్ల ఇలా జరిగింది. ఎట్టకేలకు ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొ...