భారతదేశం, జూన్ 16 -- యావత్​ భారత దేశం ఎదురుచూస్తున్న జనగణనపై కేంద్రం సోమవారం అధికారిక నోటిఫికేషన్​ని జారీ చేసింది. 2027 సెన్సస్​ రెండు దశల్లో జరుగుతుందని కేంద్రం వెల్లడించింది. ఈ నోటిఫికేషన్‌లో 2027 జనాభా గణన కోసం రిఫరెన్స్ తేదీని కూడా ప్రకటించింది.

తొలి దశలో భాగంగా లద్దాఖ్​, జమ్ముకశ్మీర్​, హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​లోని మంచుతో నిండిన ప్రాంతాలకు అక్టోబర్​ 1, 2026ని రిఫరెన్సీ తేదీగా కేంద్రం ప్రకటించింది. రెండో దశలో మార్చ్​ 1, 2027ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రిఫరెన్స్ తేదీగా ఉంటుందని తెలియజేసింది.

వాస్తవానికి 2021లో జనగణన జరగాల్సి ఉంది. కానీ కొవిడ్​ సంక్షోభం కారణంగా ఇండియాలో జనాభా లెక్కలు ఆలస్యమవుతూ వచ్చాయి. చివరికి, 2026లో మొదలవుతాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....