Hyderabad, ఆగస్టు 15 -- బాలీవుడ్ నటి కృతి సనన్ ముంబైలోని ప్రముఖ బాంద్రా ప్రాంతంలో సీ ఫేసింగ్ లో ఉన్న ఒక డూప్లెక్స్ పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేసింది. దీని కోసం ఆమె ఏకంగా రూ.78.2 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాలు వెల్లడించాయి. పాలీ హిల్‌లోని సుప్రీమ్ ప్రానా అనే లగ్జరీ ప్రాజెక్ట్‌లో ఉన్న ఈ డూప్లెక్స్.. 14, 15వ అంతస్తులలో 7,302 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో ఆరు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ డీల్, చదరపు అడుగుకు దాదాపు రూ.1.18 లక్షల ధరతో.. నగర శివారు ప్రాంతాలలో అత్యంత ఖరీదైన ట్రాన్సాక్షన్లలో ఒకటిగా నిలిచింది.

ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ మూవీలో సీతగా నటించిన కృతి సనన్ కొన్నాళ్లుగా బాలీవుడ్ లో చాలా బిజీ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. దీంతో తక్కువ కాలంలోనే పెద్ద మొత్తంలో వెనకేసుకుంది. ఇప్పుడు ఏకంగా రూ.78.2 కోట్లు...