భారతదేశం, మే 14 -- హైదరాబాద్ మెట్రో నగర శివార్లకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. మెట్రో రైల్‌ ప్రాజెక్టులో రెండోదశలో చేపట్టే మలివిడత కారిడార్‌ను ఖరారు చేవారు. రూ.19వేల కోట్ల అంచనాలతో ఈ కారిడార్ల నిర్మాణం చేపడతారు.

మెట్రో రెండో దశ చివరి విడత ప్రాజెక్టులో భాగంగా మూడు రూట్లలో 86.5 కి.మీ దూరంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో 1. జేబీఎస్-మేడ్చల్, 2.జేబీఎస్-శామీర్‌పేట, 3. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ -ప్యూచర్‌ సిటీ మార్గాలు ఉంటాయి.

మూడు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లిమిటెడ్ బోర్డు తెలిపింది. తాజాగా డీపీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. మంత్రి వర్గంలో ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపుతారు.

హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు మలిదశ నిర్మాణంలో ఎక్కడా డబుల...