భారతదేశం, ఆగస్టు 12 -- ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్.. భారత మార్కెట్​లో కొత్త కారును విడుదల చేసింది. దాని పేరు సిట్రోయెన్​ సీ3ఎక్స్​. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.91 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది కంపెనీ "సిట్రోయెన్ 2.0 - షిఫ్ట్ ఇన్‌టు ది న్యూ" వ్యూహంలో భాగంగా వచ్చింది. స్టాండర్డ్ సిట్రోయెన్ సీ3 ఆధారంగా రూపొందించినప్పటికీ.. ఈ సీ3ఎక్స్ మెరుగైన ఫీచర్లతో వస్తుంది. సీ3 మోడల్‌ను "హ్యాచ్‌బ్యాక్ విత్​ ట్విస్ట్​"గా పేర్కొనగా, ఈ సీ3ఎక్స్​ను మాత్రం కంపెనీ ఎస్‌యూవీగానే అభివర్ణించింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

సిట్రోయెన్ సీ3ఎక్స్, ప్రీమియం ఫీచర్లు, వినూత్న టెక్నాలజీతో ప్రత్యేకంగా ఉంటుంది అని కంపెనీ నమ్ముతోంది. స్టెలాంటిస్ ఇండియా ఆటోమోటివ్ బ్రాండ్స్ బిజినెస్ హెడ్ అండ్ డైరెక్టర్ కుమార్ ప్రియేష్ మాట్లాడుతూ, "మీ రోజువారీ అవసరాలను అర్థం ...