భారతదేశం, ఆగస్టు 31 -- భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2025 సంవత్సరానికి గాను కోర్ట్ మాస్టర్ (షార్ట్‌హ్యాండ్) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గెజిటెడ్ పోస్ట్ అయిన ఈ ఉద్యోగాలకు మొత్తం 30 ఖాళీలు ఉన్నట్లు అధికారిక నోటిఫికేషన్ (నెం. F.6/RC(CM)-2025, తేదీ జూలై 28, 2025) లో ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 67,700 జీతంతో పాటు ఇతర భత్యాలు లభిస్తాయి.

ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 30 కోర్ట్ మాస్టర్ (షార్ట్‌హ్యాండ్) పోస్టులు ఉన్నాయి. వీటిలో 16 పోస్టులు అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి, 4 షెడ్యూల్డ్ కులాలకు, 2 షెడ్యూల్డ్ తెగలకు, 8 వెనుకబడిన తరగతులకు కేటాయించారు.

వయస్సు: అభ్యర్థులు 30 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు షార్ట్‌హ్యా...