భారతదేశం, మే 5 -- ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ స్కూటర్ సెగ్మెంట్​లో ఇప్పుడు చాలా ఆప్షన్స్​ ఉన్నాయి. కొత్త కొత్త ప్రాడక్ట్స్​ లాంచ్​ అవుతూనే ఉంటున్నాయి. ఫలితంగా బడ్జెట్​కి తగ్గట్టు మోడల్స్​ లభిస్తున్నాయి. మరి మీరు తక్కువ బడ్జెట్​లో ఒక కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే 60 కి.మీ రేంజ్​ ఇచ్చే గ్రీన్​ సన్నీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర కేవలం రూ. 27,999. దీన్ని నడిపేందుకు డ్రైవింగ్​ లైసెన్స్​ కూడా అవసరం లేకపోవడమే మరో విశేషం. ఈ నేపథ్యంలో ఈ ఈ-స్కూటర్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సిటీ డ్రైవింగ్​కి, అడల్ట్స్​ కోసం ఉపయోగపడే విధంగా ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని రూపొందించినట్టు సంస్థ చెబుతోంది. ఆర్టీఓ రిజిస్ట్రేషన్​, డ్రైవింగ్​ లైన్స్​ అవసరం లేకపోవడంతో ఈ వెహికిల్​...