భారతదేశం, జూలై 7 -- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టింది. దీని వల్ల అర్హులైన భారతీయులు నిర్ణీత రుసుము చెల్లించి జీవితకాల రెసిడెన్సీని పొందే అవకాశం లభించింది!

"కొత్త నామినేషన్ ఆధారిత వీసా విధానం" ప్రకారం.. భారతీయులు ఏఈడీ 1,00,000 (సుమారు రూ. 23.30 లక్షలు) రుసుము చెల్లించి యూఏఈ గోల్డెన్ వీసాను జీవితకాలం పొందవచ్చని మీడియా కథనాలు చెబుతున్నాయి.

తాజా విధానం రాకముందు, గోల్డెన్ వీసా పొందడానికి భారతీయులు కనీసం ఏఈడీ 2 మిలియన్లు (రూ. 4.66 కోట్లు) విలువైన ఆస్తిలో పెట్టుబడి పెట్టడం లేదా దుబాయ్​ సహా ఈ గల్ఫ్ దేశంలో ఒక వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం తప్పనిసరి.

అధికారుల ప్రకారం, నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసా టెస్టింగ్​ మొదటి దశ కోసం భారత్- బంగ్లాదేశ్‌లను ఎంపిక చేశారు.

భారతదేశంలో ఈ నామినేషన్ ఆధార...