భారతదేశం, సెప్టెంబర్ 13 -- భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్‌లో టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త 'స్పెషల్ ఎడిషన్'ను లాంచ్​ చేసింది. దీని పేరు టీవీఎస్​ జూపిటర్​ స్టార్​డస్ట్​ బ్లాక్​. ఈ స్కూటర్ ధర రూ. 93,031 (ఎక్స్-షోరూమ్). దీనితో జూపిటర్ శ్రేణిలో ఇదే అత్యంత ఖరీదైన మోడల్‌గా నిలిచింది. అంతేకాకుండా.. భారతదేశంలో హోండా యాక్టివా స్మార్ట్ తర్వాత రెండో అత్యంత ఖరీదైన 110సీసీ స్కూటర్‌గా కూడా గుర్తింపు పొందింది. విశ్వసనీయతకు, నిత్యం వాడకానికి జూపిటర్ ఇప్పటికే పేరుగాంచింది. అయితే ఇప్పుడు ఈ స్పెషల్ ఎడిషన్ ప్రత్యేకమైన లుక్‌తో స్టైల్‌కు ప్రాధాన్యత ఇచ్చే కస్టమర్లను ఆకట్టుకునేలా రూపొందించడం జరిగింది.

ఈ టీవీఎస్​ జూపిటర్​ స్టార్​డస్ట్​ బ్లాక్​ ఎడిషన్​ స్కూటర్​లో అత్యంత ఆకర్షణీయమైన మార్పు 'ఆల్-బ్లాక్' పెయింట్ స్కీమ్. ఇది స్కూటర్ బాడ...