భారతదేశం, మే 10 -- మీరు కొత్తగా ఇన్వెస్ట్​మెంట్​ జర్నీని ప్రారంభించాలని ప్లాన్​ చేస్తున్నారా? మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఈ లో రిస్క్​- హై రిటర్న్​ ఫండ్స్​ గురించి మీరు తెలుసుకోవాల్సిందే! ఈ లార్జ్​ క్యాప్​ మ్యూచవల్​ ఫండ్స్​లో 5ఏళ్లల్లో 20శాతం కన్నా ఎక్కువ సీఏజీఆర్​ రిటర్నులు లభించడం విశేషం.

మ్యూచువల్ ఫండ్స్​ సెబీ వర్గీకరణ ప్రకారం తమ ఆస్తుల్లో 80 శాతాన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్​లో ఇన్వెస్ట్ చేసే పథకాలను లార్జ్ క్యాప్ మ్యూచువల్​ ఫండ్స్​ అంటారు. మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. వీటిల్లో ఒడుగొడుకులు తక్కువగా ఉంటాయి.

ఏప్రిల్ 30, 2025 నాటికి యాంఫీ డేటా ప్రకారం మొత్తం 33 లార్జ్ క్యాప్ పథకాలు రూ .3.74 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో రూ.2,671 కో...