భారతదేశం, డిసెంబర్ 29 -- బంగారం కంటే వేగంగా పరుగులు పెడుతూ, ఈ ఏడాది అత్యుత్తమ రాబడిని ఇస్తున్న ఆస్తిగా వెండి నిలిచింది. సోమవారం (డిసెంబర్ 29) దేశీయ మార్కెట్లో వెండి ధర సరికొత్త చరిత్ర సృష్టించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో కిలో వెండి ధర ఏకంగా 6 శాతం ఎగబాకి, మొదటిసారిగా రూ. 2,54,000 మార్కును అధిగమించింది.

ప్రస్తుతం వెండి మార్కెట్ క్యాప్ 4.65 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఉన్న టెక్ దిగ్గజం 'ఎన్విడియా' (4.63 ట్రిలియన్ డాలర్లు) మార్కెట్ విలువ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటి వరకు వెండి ఏకంగా 181 శాతం వృద్ధిని నమోదు చేసి, ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.

అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ఒక దశలో 80 డాలర్ల మార్కును దాటి 83.62 డాలర్ల వద్ద ఆల్-టైమ్ హైని తాకింది. అయితే, ఆ తర్వాత ఇన్...