భారతదేశం, జూలై 15 -- ఎనర్జిటిక్ స్టార్, యంగ్ హీరో రామ్ పోతినేనికి ఐదేళ్లుగా సరైన హిట్ లేదు. గత రెండు చిత్రాలు స్కంద, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ అయ్యాయి. వరుసగా చేసిన మాస్ యాక్షన్ చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో మళ్లీ తన మార్క్ చిత్రం చేస్తున్నారు. రామ్ ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో నటిస్తున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ఫేమ్ డైరెక్టర్ మహేశ్ బాబు.పి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రం ఓటీటీ డీల్ చేసుకుంది.

ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఓటీటీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ తీసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ తుది దశలో ఉంది. మరికొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ తరుణంలో ఓటీటీ డీల్ జరిగింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుంది. ...