Hyderabad, జూలై 2 -- శంకర్‌ దర్శకత్వంలో రామ్ చరణ్, ఎస్.జె. సూర్య, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా విడుదలై ఆరు నెలలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైనా అది బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అయితే ఇన్నాళ్లకు ఇప్పుడు మళ్ళీ అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.

దీనికి కారణం ఈ సినిమా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు మెగా అభిమానులను తీవ్రంగా బాధపెట్టాయి. దీంతో, ఈ వ్యాఖ్యలపై ఇద్దరూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

'గ్రేట్ ఆంధ్ర'కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శిరీష్ మాట్లాడుతూ, 'గేమ్ ఛేంజర్' పరాజయం తర్వాత తమ జీవితాలు అయిపోయినట్లేనని భావించామని, అయితే వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా తమను నిలబెట్టిందని అన్నాడు. అంతేకాదు, సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైన తర్వాత శంకర్‌ గానీ...