భారతదేశం, జనవరి 5 -- మన దేశీ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, ఒక జపాన్ చెఫ్ మన బిర్యానీ రుచికి ముగ్ధుడై, దాని తయారీలో ప్రావీణ్యం సంపాదించి, ఏకంగా మన 'మెగా పవర్ స్టార్' రామ్ చరణ్ ఇంట్లోనే వంట చేస్తే.. ఆ మజానే వేరు.

జపాన్‌లోని టోక్యోకు చెందిన ప్రముఖ చెఫ్ తకమాసా ఒసావా తాజాగా హైదరాబాద్‌లోని రామ్ చరణ్ నివాసానికి వచ్చి మెగా కుటుంబానికి బిర్యానీ విందు ఇచ్చారు. రామ్ చరణ్ జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన ఈ ప్రత్యేక విందులో చెర్రీతోపాటు ఉపాసనకు ఈ స్పెషల్ బిర్యానీ వండాడు చెఫ్ తకమాసా ఒసావా. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఒసావా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

"ఈ రోజు ఒక ప్రైవేట్ నివాసంలో బిర్యానీ వండాను. నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. అసలైన బిర్యానీ అంటే ఏంటో ఈ నగరం నాకు నేర్పిస్తూనే ఉంది" అని ...